Header Banner

OTTకి మలయాళ మిస్టరీ థ్రిల్లర్! ఈ కథ ప్రేక్షకులకు ఎంతవరకూ..

  Thu Mar 06, 2025 21:17        Entertainment

మలయాళ సినిమాల పట్ల ఇతర భాషా ప్రేక్షకులకు ఆసక్తి పెరిగిపోయింది. అందువలన ఓటీటీ ద్వారా వస్తున్న మలయాళ సినిమాలకు మంచి ఆదరణ లభిస్తోంది. ఈ నేపథ్యంలో 'ది సీక్రెట్ ఆఫ్ ఉమెన్' సినిమా పట్ల అందరూ కుతూహలంతో ఉన్నారు. అలాంటి ఈ సినిమా త్వరలో 'సన్ నెక్స్ట్' ద్వారా ప్రేక్షకుల ముందుకు రానుంది. అందుకు సంబంధించి అధికారిక ప్రకటన వచ్చేసింది. ఈ సినిమాకి ప్రజేస్ సేన్ కథ .. స్క్రీన్ ప్లే అందించడమే కాకుండా, దర్శక నిర్మాతగాను వ్యవహరించాడు. నిరంజన అనూప్ .. అజూ వర్గీస్ .. శ్రీకాంత్ మురళి ప్రధానమైన పాత్రలను పోషించారు. జీనా - సెంథిల్, ఎల్డో - షీలా అనే రెండు జంటల మధ్య ఈ కథ నడుస్తుంది. వారి మధ్య ఉన్న సంబంధం ఏమిటి? అనుబంధం ఏమిటి? అనేది కథ. ఓటీటీ సినిమాల ద్వారా అజూ వర్గీస్ .. శ్రీకాంత్ మురళి .. నిరంజనా అనూప్ .. ఈ ముగ్గురూ కూడా ఇతర భాషా ప్రేక్షకులకు సుపరిచితులే.  త్వరలోనే సన్ నెక్స్ట్ వారు స్ట్రీమింగ్ డేట్ సనౌన్స్ చేయనున్నారు. మిస్టరీ థ్రిల్లర్ జోనర్లో నడిచే ఈ కథ ప్రేక్షకులకు ఎంతవరకూ కనెక్ట్ అవుతుందనేది చూడాలి. 

 

ఇది కూడా చదవండి: వైసీపీకి దిమ్మ తిరిగి సీన్ రివర్స్.. లోకేష్ సంచలన కామెంట్స్.! వేట మొదలైంది.. వారందరికీ జైలు శిక్ష తప్పదు!

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

కేదార్‌నాథ్ రోప్‌వేకు గ్రీన్ సిగ్నల్… ఇక ప్రయాణం 36 నిమిషాల్లో పూర్తి! మోడీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం!

 

వైసీపీకి వరుస షాక్ లు.. వంశీ నుంచి మరింత సమాచారం.. బెయిల్​ ఇవ్వొద్దు.!

 

30 ఏళ్ల తర్వాత ఆసక్తికర దృశ్యం.. వెంకయ్యనాయుడులో పవర్, పంచ్‌లు తగ్గలేదు! మా రెండో అబ్బాయికి..

 

మీ ఇంట్లో గ్యాస్ సిలిండర్ ఉందా.? అయితే మీకు రెండు శుభవార్తలు! అలా చేస్తే కఠిన చర్యలు..

 

వైఎస్ వివేకా కేసులో షాక్! కీలక సాక్షి మృతి.. విచారణ కొత్త మలుపు!

 

మాజీ మంత్రి రోజాకు షాక్! ఆడుదాం ఆంధ్రా’పై స్వతంత్ర విచారణకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #NiranjanaAnoop #AjuVarghese #SrikanthMurali